మైనర్ బాలికపై గ్యాంగ్‌ రేప్.. ఆరుగురు కామాంధుల అరెస్ట్.

Ongole:

బాలిక ఒంటరిగా వచ్చిందన్న విషయం గ్రహించిన బాబూరావు మాయమాటలు చెప్పి తన రూమ్‌కి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను బెదిరించి అత్యాచారం చేశాడు. తర్వాత తన స్నేహితులకు సమాచారమివ్వగా వారు కూడా బాలికను బెదిరించి ఐదు రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.







హైలైట్స్:

  • మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో ఆరుగురి అరెస్ట్
  • కామాంధులను మీడియా ఎదుట ప్రవేశపెట్టిన ఒంగోలు పోలీసులు
  • వైద్య పరీక్షల నిమిత్తం బాలిక ఆస్పత్రికి తరలింపు
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో మైనర్ బాలికపై గ్యాంగ్‌ రేప్ కేసును పోలీసులు ఛేదించారు. అత్యాచారానికి పాల్పడిన ఆరుగురు కామాంధులను అరెస్ట్ చేసిన పోలీసులు ఆదివారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ మీడియాకు వివరించారు. ఆరుగురు నిందితుల్లో నలుగురిని శనివారమే అరెస్ట్ చేయగా.. ఆదివారం మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఒంగోలు పోలీసులు, శక్తి టీమ్ సకాలంతో స్పందించడంతోనే నిందితులను త్వరగా పట్టుకున్నామని ఎస్పీ తెలిపారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. 

Comments

Popular posts from this blog

Procedure for Krishna University ug degree Consolidated marks memo (cmm) application download