"నేను లెస్బియన్ (lesbian), తప్పు ఏముంది ? " - నిత్యామీనన్. ఏదో ఒక ప్రత్యేకత లేనిదే పాత్రలకు ఓకే చెప్పని తత్వం వున్న విలక్షణమైన నటి నిత్యమీనన్. వైవిధ్యమైన పాత్రలు, సినిమాలతో ఆకట్టుకొంటున్న నిత్యామీనన్ కథా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లోనే కనిపిస్తారు. ఆమె నటించే పాత్రల్లో ఆమె మార్కు కనిపిస్తుంది. నిత్యమీనన్ తాజాగా నటించిన అ! చిత్రంలో స్వలింగ సంపర్కురాలిగా వెరైటీ పాత్రలో కనిపించింది. తాజాగా ఆ చిత్రం నేపథ్యంలో తన అనుభవాలను, అభిప్రాయాలను నిత్య మీడియాతో పంచుకుంది. కథ విన్నప్పుడు... అ! చిత్రం కథ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చెప్పినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. సాధారణంగా చాలా కథలు వింటాం. కానీ ఇలాంటి స్టోరి వినడం చాలా రేర్. ఎప్పడూ రొటీన్ పాత్రలు చేస్తుంటాం. ఒక పాత్ర చేస్తే అలాంటి పాత్రలు వస్తుంటాయి. అ! చిత్రంలోని క్రిష్ లాంటి పాత్రను దర్శకుడు చాలా కొత్తగా మలిచాడు. అదే విషయం నన్ను చాలా ఆకట్టుకుంది. కథ చెప్పగానే నేను ఎగిరి గంతేస్తానని నాని చిత్ర దర్శకుడు ప్రశాంత్‌తో చెప్పిన మాట వాస్తవమే. నాకు క్రేజీ క్యారెక్టర్లు చేయడమంటే చెప్పలేనంత ఇష్టం. ఒకేరకమైన పాత్రలు చేయడం ద్వారా బోర్ కొడుతుంద...